చలివేంద్ర్రాలు ఏర్పాటు

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

శ్రీకాకుళం అర్బన్‌ : చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాసరావు

శ్రీకాకుళం అర్బన్‌ :

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు అధినేత డాక్టర్‌ సూర శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్తయ్యే వరకూ చలివేంద్రంతో రోజూ స్వచ్ఛమైన తాగునీటిని, మజ్జిగను అందించనున్నట్లు తెలిపారు. ఏటా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ ఏడాదీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. జిల్లాలో ఎండలు బాగా పెరుగుతున్న దష్ట్యా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. బయటకు వచ్చేటప్పుడు తలపై టోపీ ధరించాలని, లేకుంటే గొడుగు పట్టుకుని వెళ్లాలని చెప్పారు.అలాగే పాత బస్టాండ్‌ కూడలి వద్ద మార్కెట్‌ ప్రాంగణంలో 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎఎస్‌ఐ జి. రాంబాబు, లయన్స్‌ బ్లడ్‌ బ్యాంకు మేనేజర్‌ సునీల్‌ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ ప్యాకెట్లను అందించారు. జిల్‌ ఫౌండేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాడ సాయి, జెసిఐ ప్రెసిడెంట్‌ శివతేజ పాల్గొన్నారు.పలాస : స్థానిక ఇందిరా చౌక వద్ద లయన్స్‌క్లబ్‌ క్యాజు ల్యాండ్‌ అధ్యక్షులు మల్లా జయశ్రీ చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మల్లా భాస్కరరావు, కార్యదర్శి తర్లనా శ్వేతకుమారి, కోశాధికారి మల్లా సంతోషి, తూముల గాయత్రి, తాళసు లత పాల్గొన్నారు.మెళియాపుట్టి : మండలంలోని పెద్దలక్ష్మీపురం బస్సు సెల్టర్‌ వద్ద విఆర్‌ఒ అన్నాజీరావు, కార్యదర్శి కె.వి.ప్రసాద్‌లు చలివేంద్రాన్ని ప్రారంభించారు. డి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

 

➡️