పి.ఎర్రగొండ గురుకుల బాలికల కాలేజీకి మహిళా ప్రిన్సిపాల్ ని నియమించాలి

appoint principal to gurukula college

గిరిజనసంఘం డిమాండ్
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఏపిటీడబ్ల్యూ ఆర్ బాలికల కళాశాలలో బాలికలు ఇబ్బందుల నేపథ్యంలో తక్షణం మహిళా ప్రిన్సిపాల్ నియమించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు శుక్రవారం డిమాండ్ చేశారు. వై.రామవరం మండలం పి ఎర్రగొండ గురుకులం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు సస్పెండ్ చెయ్యాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కళాశాల గేటు ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారని తెలిపారు. ఈ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కారం చెయ్యాలని కళాశాలకు వచ్చిన గురుకులం జాయింట్ సెక్రటరీ కి విద్యార్థులు వ్రాతపూర్వకంగా వ్రాసి ఇచ్చారని, అలాగే ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు నవంబర్ నెల 25వ కళాశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు సమస్యలపై గత నెల 29న ప్రాజెక్టు అధికారి రంపచోడవరం వారికి పిర్యాదు చెయ్యగా ఆయన మీద చర్యలు తీసుకోకపోవడంతో కళాశాల గేటు ముందు ధర్నా చేపట్టారన్నారు. ఏకలవ్య ప్రిన్సిపాల్ రామకృష్ణ ధర్నా వద్దకు వచ్చి నాకు ప్రిన్సిపాల్ ఇంచార్జ్ అప్పగించడం జరిగిందని మీ సమస్యలు అన్ని పరిస్కారం చేస్తానని చెప్పటంతో విద్యార్థులు సమస్యలు ఒక్కటే కాదని కళాశాల ఆపిస్ రూమ్ లో ప్రిన్సిపాల్ అసభ్యకరమైన(రాసలీలలు) కొనసాగిస్తున్న ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చెయ్యాలని విద్యార్థులు డిమాండ్ చేశారని తెలిపారు. గురుకులం సెల్ జాయింట్ సెక్రటరీకి ఫోన్ చెయ్యగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా విద్యార్థినిలు ఆందోళనను విరమించారని తెలిపారు. ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చెయ్యని యెడల పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిక చేయడం జరిగిందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరాతం కాకుండా ఉండాలంటే తక్షణం ప్రిన్సిపల్ ని ఉద్యోగం నుంచి తొలగించాలని బాలికల కళాశాలలో మహిళ ప్రిన్సిపాల్ ను మాత్రమే నియమించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️