కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ … కేంద్ర ప్రభుత్వం ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించింది. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు కానున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో … ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ భేటీలో వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు పాల్గొన్నారు.

డిసెంబర్‌ 4వ తేదీ నుంచి 22 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది. జమ్మూకాశ్మీర్‌, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మఅతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. ఈ శీతాకాల సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్‌ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి, సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు.

➡️