అభిమానం … ఆకర్షణీయంగా నిలిచిన బైక్‌ ప్రచారం

Apr 19,2024 12:30 #attract, #bike campaign, #fans

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ అభిమాని వినూత్నంగా తన బైక్‌ కు వైసిపి పార్టీ జెండాలు, ఫ్యాను గుర్తుతో గురువారం వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృపా లక్ష్మి నామినేషన్‌ సందర్భంగా పాలసముద్రం మండలం, వెంగళరాజుకుప్పం గ్రామానికి చెందిన కుట్టి తన సొంత బైక్‌ కి పార్టీ జెండాలు గుర్తు అమర్చి ప్రచారానికి వచ్చాడు. దీనిపై ప్రజాశక్తి ముచ్చటించగా జగన్‌ పై అభిమానంతో 2019 నుంచి వాహనాన్ని ఇలా తయారు చేసినట్లు ఆయన తెలిపాడు. అతను ఆ గ్రామంలో టీవీ మెకానిగా ఉన్నట్లు చెబుతున్నాడు. ఆయన అభిమానానికి అందరూ ఫిదా అయ్యారు. అభిమానం అంటే ఇదే కదా అని చూసినవారు సంతోషం వ్యక్తం చేశారు.

➡️