రేపటి నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణి

aarogyasri new cards

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి సోమవారం(డిసెంబర్ 18) నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహుం 12 గంటలకు క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభినున్నారు. ఈ నెల 19 నుంచి క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1.42 కోట్ల కొత్త కార్టుల ముద్రణకుప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. అరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకూ ఉను రూ.5 లక్షల బీమా మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. కేన్సర్‌ వంటి అనేక ప్రొసీజర్స్‌లో వ్యయ పరిమితి లేకుండా వైద్య సేవలు అందించనునాురు. ఇలాంటి వాటి కోసం గత నాలుగేళ్లగా రూ.1897 కోట్ల పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. వెయ్యి రూపాయల మొదలుకొని రూ.25 లక్షల వరకు ఖర్చుయ్యే చికిత్సలన్నీ ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. మొత్తం 3,257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా 53,02,816 మంది లబ్ది పొందారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి ఫోన్‌లోనూ ఆరోగ్యశ్రీ యాప్‌ ఉండేలా చూస్తోంది.

➡️