గొప్ప స్త్రీ వాది జ్యోతిరావుపూలే

Apr 11,2024 21:19

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :మానవులందరిలో గొప్ప స్త్రీవాది జ్యోతిరావుపూలేనని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ కొనియాడారు. జ్యోతిబా పూలే జయంతి స్థానిక సుందరయ్య భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత పూలే చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుబ్బరావమ్మ మాట్లాడుతూ బాలికా విద్య కోసం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో ‘రాత్రి బడి’ని స్థాపిం చారన్నారు. అలాగే దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్‌ సమాజ్‌ (సొసైటీ ఆఫ్‌ సీకర్స్‌ ఆఫ్‌ ట్రూత్‌)ను ఏర్పాటు చేశారన్నారు. అట్టడుగు కులాలకు విద్యను అందించడంలో సహాయం చేయాలని పిలుపునిచ్చారన్నారు. దీన్ని అమలు చేయడా నికి, ఆయన గ్రామాల్లో ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయాలని సూచించార న్నారు. ఫూలే అణిచివేతకు గురౌతున్న పేదల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్పకృషి చేశారని కొనియాడారు. ‘ఒక పురుషునికి విద్యనందిస్తే, వీరు ఒక వ్యక్తికి విద్యను అందిస్తారు, కానీ మీరు ఒక స్త్రీకి విద్యను అందిస్తే వారు మొత్తం కుటుంబానికి విద్యను అందిస్తారని పూలే పలుమార్లు చెప్పారన్నారు. అందుకే ఆయన్ను సమన్యాయ సత్య శోధకుడని పిలుస్తార్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణా రావు, ప్రధాన కార్యదర్శి వై. మన్మధరావు, నాయకులు వి.ఇందిర, ఎన్‌వై నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️