పోలీసులకు యోగ అవగాహన సదస్సు

Mar 22,2024 13:14 #Konaseema
  • యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
  • అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాష

ప్రజాశక్తి-అమలాపురం : శ్రీ స్వామి వివేకానంద యోగా ఆశ్రమం గురువు డాక్టర్ జిమ్ యోగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాష , ఏ ఆర్ డి ఎస్ పి విజయ సారధిల నేతృత్వంలో శుక్రవారం పోలీసు సిబ్బందికి యోగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వల్ల మన ఒంట్లో ఒత్తిడి తగ్గడంతో పాటు ఒత్తిడి నుంచి పుట్టే వ్యాధులు దూరం చేయడమే కాకుండా ప్రశాంతమైన జీవితం యోగా ప్రసాదిస్తుందని యోగా ప్రాణ నియమాలు చేస్తే శ్వాసకు సంబంధించిన వ్యాధుల దూరం చేసి మన శరీరంలో 72వేల నాడులను క్రమ పద్ధతిలో పనిచేసేలా చేస్తుందని అన్నారు. నేటి యువత యోగాతో పాటు ఆహార నియమాలు పాటిస్తే గ్యాస్టిక్ సమస్య గుండెకి సంబంధించిన వ్యాధులు బీపీ షుగర్ కీళ్లనొప్పులు వంటి వ్యాధులు రానివ్వకుండా యోగ కాపాడుతుందని ఎస్పీ ఖాదర్ భాషా అన్నారు.ఈ యోగా అవగాహన సదస్సులో పోలీస్ సిబ్బంది యోగా విద్యార్థులు పాల్గొన్నారని యోగా గురువు ఆయుర్వేదం ఫిజియోథెరపీ వైద్యుడు యోగా శ్రీనివాస్ అన్నారు. నేటి తరం యువత యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని శ్రీనివాస్ అన్నారు.

➡️