ప్రతి మహిళను లక్షాధికారి చేయడమే లక్ష్యం

Jan 29,2024 11:37 #Kadapa
ysr asara in chapadu

ప్రజాశక్తి – చాపాడు :  ప్రతి మహిళా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ లక్షాధికారి చేయడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యమని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక యాసిన్ కళ్యాణమండపంలో వైయస్సార్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమం పాల్గని అందుకు సంబంధించిన చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు వైయస్సార్ చేయూత ద్వారా రూ .75,000 రుణాలు అందించారన్నారు. 2014లో చంద్రబాబు రుణమాఫీ చేస్తామని మహిళల మోసగించారన్నారు. జగన్ మాత్రం తల్లిదండ్రులు కూడా చేయనటువంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి తల్లిదండ్రుల బాధ్యత అయినప్పటికీ జగన్ నెరవేరుస్తున్నారన్నారు. 762 సంఘాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా రూ.5.35 కోట్ల మెగా చెక్కును మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి టి లక్ష్ముమయ్య , ఎంపిడిఓ శ్రీధర్ నాయుడు,వెలుగు సిసి లావణ్య, ఏపిఎం వెంకటరమణ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ మహబూబ్ బీ, మండల సమాఖ్య అధ్యక్షురాలు మరియమ్మ , వైసిపి మండల నాయకులు రామ్మోహన్ రెడ్డి , నారాయణరెడ్డి, బాల నరసింహారెడ్డి, శాంతరాజు ,వెలుగు సీసీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

➡️