ఐఎల్‌టిడి ఎన్నికల్లో వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఘన విజయం

Feb 21,2024 08:36 #CITU, #successful

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా) : ఇండియన్‌ లీఫ్‌ టబాకో డెవలప్‌మెంట్‌ (ఐఎల్‌టిడి) కంపెనీ యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు అనుబంధ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఘన విజయం సాధించింది. కంపెనీలో చీరాలలో 1546, రాజమండ్రిలో 37, అనపర్తిలో 470 కలిపి మొత్తం 2053 ఓట్లకు గానూ సిఐటియు అనుబంధ ఫెడరేషన్‌ 338 ఓట్ల మెజారిటీతో రాష్ట్ర స్థాయి కంపెనీలో గుర్తింపు పొందింది. ఉదయం నుండి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో కార్మికులు విజయోత్సవంతో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు అనుబంధ ఐఎల్‌టిడి వర్కర్స్‌ ఫెడరేషన్‌కు, టిఎన్‌టియుసి యూనియన్‌కు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటివరకు గుర్తింపు యూనియన్‌గా ఉన్న ఐఎన్‌టియుసి మూడో స్థానానికి పడిపోయింది. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వాసంశెట్టి వెంకటరావు మాట్లాడుతూ.. కార్మికులందరూ సైనికులుగా పనిచేసి.. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి విజయం సాధించారని పేర్కొన్నారు.

➡️