శాఖాహారానికి రెక్కలు

Apr 5,2024 01:50
  •  నెలలో ఏడు శాతం పెరిగిన ధరలు
  •  క్రిసిల్‌ వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో అహారోత్పత్తుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. గడిచిన మార్చిలో శాఖాహార ఆహార ధరలు ఏడు శాతం పెరిగినట్లు ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ తెలిపింది. ఫిబ్రవరి తరహా వేగంతోనే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టొమాటోలు అలాగే బియ్యం, పప్పుల ధరలు పెరిగాయని విశ్లేషించింది. ఈ నేపథ్యంలోనే ప్లేట్‌ శాకహార భోజనం ధర ఏడు శాతం పెరిగిందని పేర్కొంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ భారతదేశంలో ఉన్న ముడి సరుకుల ధరల ఆధారంగా ఇంట్లో థాలీని తయారు చేయడానికి సగటు ధర ఆధారంగా లెక్కిస్తుంది. ఇది దేశంలో ద్రవ్యోల్బణ ధోరణులను అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. గడిచిన నెలలో ఉల్లి, టొమాటో, బంగాళదుంపల ధరలు వరుసగా ఏడాదికి 40 శాతం, 36 శాతం, 22 శాతం చొప్పున పెరిగాయని క్రిసిల్‌ పేర్కొంది.

➡️