గాయపడ్డ విలియమ్సన్‌

Jan 17,2024 08:23 #Cricket, #Newzland, #Sports, #williamson
  • పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయపడ్డాడు. దీంతో పాకిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పాకిస్తాన్‌తో హామిల్టన్‌ వేదికగా జరిగిన రెండో టి20 సందర్భంగా 33ఏళ్ల కేన్‌ గాయపడ్డాడని, అందువల్లే మ్యాచ్‌ మధ్యలో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చిందని తెలిపింది. గాయం చిన్నదైనా.. ముందస్తు జాగ్రత్త దృష్ట్యా అతడ్ని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బోర్డు నిర్ణయించినట్లు కోచ్‌ గ్యారీ స్టెట్‌ తెలిపారు.

➡️