విస్తృతంగా సెబ్‌ తనఖీలు

స్వాధీనం చేసుకున్న ఇసుక ట్రాక్టర్లను చూపిస్తున్న సెబ్‌ అధికారులు

        హిందూపురం : హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం నాడు సెబ్‌ ఎస్‌ఐలు, సిబ్బంది విస్తృతంగా తనఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా హిందూపురం సెబ్‌ స్టేషన్‌ ఎస్‌ఐలు కమలాకర్‌, రాంప్రసాద్‌, పుట్టపర్తి సెబ్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ మోహన్‌ రెడ్డి, ఎస్‌ఐ దౌలత్‌లు వారివారి సిబ్బంది విడివిడిగా అక్రమ మద్యం రవాణా, అమ్మకాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పోచంపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో పెన్నా నది దగ్గర నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రవాణా చేస్తున్న బాగేపల్లి మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివ కుమార్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి 5 బాక్సులు(480 కర్నాటక టెట్రా ప్యాకెట్లు)ను స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం మండలం వీరంపల్లి క్రాస్‌ వద్ద మలుగూరు గ్రామానికి చెందిన గంగరాజు అదపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 39 టెట్రా ప్యాకెట్లను సీజ్‌ చేశారు. హిందూపురం పట్టణం అప్పలకుంట, బావేనహల్లి నుంచి రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లును సీజ్‌ చేశారు. పుట్టపర్తి సెబ్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సడ్లపల్లికి చెందిన నరసింహమూర్తిని అరెస్ట్‌ చేసి 82 కర్నాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పళనీనగర్‌కి చెందిన చిన్న తంబిని అరెస్ట్‌ చేసి 80 టెట్రా ప్యాకెట్లను సీజ్‌ చేశారు. జంగాలపల్లి వద్ద చిరంజీవి అనే వ్యక్తిని అరెస్టు చేసి 30 టెట్రా ప్యాకెట్లను సీజ్‌ చేసినట్లు హిందూపురం సెబ్‌ సిఐ రాజశేఖర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది వెంకటేష్‌, ప్రకాష్‌, భాస్కర్‌, శంకర్‌ నాయక్‌, ఆంజనేయులు, రంగదాం పాల్గొన్నారు.

➡️