కొప్పరంలో వై ఎ పి నీడ్ జగన్

Nov 23,2023 00:29

ప్రజాశక్తి- సంతమాగులూరు
సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ పేదల జీవితాలలో వెలుగులు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్లీ రావాలని వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు అన్నారు. మండలంలోని కొప్పరం గ్రామంలో బుధవారం వై ఏపి నీడ్ జగన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సచివాలయం పరిధిలోని సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా బోర్డును ఆవిష్కరించారు. వైసిపి జెండా ఆవిష్కరించారు. సచివాలయంలో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ అవసరం, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. గత టిడిపి ప్రభుత్వ పరిపాలన కేవలం సంపన్నులకే పరిమితమైనదని అన్నారు. పేదలను నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాలుగు విడతలంటూ ప్రతి రైతుకు పత్రాలు పంపిణీ చేసి అందులో కేవలం రెండు విడతలు మాత్రమే జమచేసి మిగిలిన రెండు విడతల సొమ్ముకు పంగనామాలు పెట్టారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం చేసిన నుండి మేనిఫెస్టో అమలుపరచి పేదల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను క్షేత్రస్థాయికి తీసుకువచ్చారని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు, సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ కుల, మత, పార్టీలకతీతంగా అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి అంగడి కోటేశ్వరమ్మ, జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, నాయకులు అంగడి నాగేశ్వరరావు, తమ్మిశెట్టి సుబ్బయ్య, పేరం కోటేశ్వరరావు, బండి కోటిరెడ్డి, మదన్, తేలప్రోలు వెంకట్రావు, సొసైటీ అధ్యక్షులు మహబూబ్ సుభాని, షేక్ మస్తాన్ వలి పాల్గొన్నారు.

➡️