ఆసీస్పై వెస్టిండీస్ సంచలన విజయం..

Jan 28,2024 13:22 #Cricket, #Sports

ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ 7 వికెట్లతో ఆస్ట్రేలియా పతనం శాసించాడు. కాగా విజయంతో 21 ఏళ్ల తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాపై కరేబియన్లు విజయం సాధించారు. ఈ మ్యాచ్లో స్టీవెన్ స్మిత్ (91), కామెరాన్ గ్రీన్ (42), మిచెల్ స్టార్క్(21) మాత్రమే రాణించారు. ఉస్మాన్ ఖవాజా(10), మార్నస్ లాబుషేన్ (5), ట్రావిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(10), అలెక్స్ కారీ (2), పాట్ కమిన్స్ (2), నాథన్ లియోన్(9), జోష్ హేజిల్‌వుడ్(0) బ్యాటింగ్లో విఫలమవ్వడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది.

➡️