స్వాగతం పలుకుదాం

Apr 9,2024 07:26 #Poetry, #Sneha

పండుటాకుల
మేలిముసుగు తొలగిస్తూ
మోడువారిన తరువులు
మోదంతో చిగురించగా,
ఆమని సంతసంగా
వసంతాలు రంగరించింది
గండు కోయిలలు మధురగానాలు
ఆలపిస్తున్న వేళ
మల్లె, విరజాజులు
సుమ గంధాల పరిమళాలు
వెదజల్లుతుండగా
నిశీధిని చీల్చుకుంటూ
ఉదయ కిరణాలతో
వేంచేసిన ‘క్రోధి’ వత్సరంలో
పాలకుల మానసము
సముచిత ఆలోచనలను స్రవించాలని,
ప్రకృతి మాత
నిత్య వసంత శోభతో కళకళలాడాలని,
జనుల బతుకుల్లో
ఉషస్సులు నిండాలని కోరుకుంటూ
ఆశయ సాధనకై అడుగులు వేస్తూ,
ఉగాది లక్ష్మిని సాదరంగా స్వాగతిద్దాం.

  • వేమూరి శ్రీనివాస్‌
    9912128967
➡️