రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నాం :మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ

అమరావతి: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కులగణనతో భయపడుతున్నారని మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ ఎద్దేవా చేశారు. కులగణనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకీ పవన్‌ కళ్యాణ్‌ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలన్నారు. అవగాహన రాహిత్యంతో పవన్‌ కళ్యాణ్‌ కులగణనపై వ్యాఖ్యలు చేసారు.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీహార్‌ లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది.. రాష్ట్రంలో పౌరులు ఏవిధంగా జీవిస్తున్నారు.. వారి అవసరాలపై కులగణన జరుగుతుంది.. సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది అని మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ ప్రశ్నించారు.రాష్ట్రంలో 67 శాతం కులగణన పూర్తైంది.. 1,26,000 కుటుంబాలను నేరుగా చూశాం.. 2 కోట్ల జనాభాతో మాట్లాడాం.. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారు అని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.చంద్రబాబు జనసైనికులను మోసం చేయడానికే టికెట్లు ముందు ప్రకటించారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎనౌన్స్‌ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్‌ కళ్యాణ్‌ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?.. రేపొద్దున చంద్రబాబు 150 అంటే పవన్‌ కళ్యాణ్‌ 150 అనగలడా? అని ఆయన ప్రశ్నించారు. 15 లేదా 20 సీట్లలో పవన్‌ కళ్యాణ్‌ దిగజారి పోటీ చేస్తారు, తప్పా అంతకు మించి ఏమీ లేదు.. జగన్‌ మోహన్‌ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పవన్‌ కళ్యాణ్‌ పని చేస్తున్నాడు.. తప్పితే ప్రజలపై చిత్తశుద్ధి లేదు అని మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ తెలిపారు.

➡️