తెలుగు రాష్ట్రాల్లో స్టోర్లను రెట్టింపు చేస్తాం

Apr 16,2024 21:15 #Business, #hydrabad, #sleep
  • ది స్లీప్‌ కో-ఫౌండర్‌ ప్రియాంక సలోట్‌ వెల్లడి
  • హైదరాబాద్‌లో 75వ అవుట్‌లెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : పరుపుల స్టార్టప్‌ కంపెనీ, కంఫర్ట్‌ టెక్‌ బ్రాండ్‌ ది స్లీప్‌ 2025 మార్చి ముగింపు నాటికి తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సంస్థ 75వ నూతన అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ప్రారంభించింది. ఈ సందర్బంగా ది స్లీప్‌ కో-ఫౌండర్‌ ప్రియాంక సలోట్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తమకు ప్రస్తుతం 12 స్టోర్లు ఉన్నాయన్నారు. ఏడాదిలో రెట్టింపు చేయాలని నిర్దేశించుకున్నామన్నారు. గతేడాది రూ.350 కోట్ల టర్నోవర్‌ సాధించామన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో రూ.1,000 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామన్నారు. భారత్‌లో పరుపుల వ్యాపార మార్కెట్‌ రూ.16వేల కోట్లుగా ఉందని.. ఇందులో 6-7వేల కోట్లు సంఘటిత మార్కెట్‌ కలిగి ఉందన్నారు. కేవలం రెండు సంవత్సరాలలో ఆరు రెట్ల వృద్థిని సాధించామన్నారు. 2024 చివరి నాటికి దేశవ్యాప్తంగా 150 పైగా స్టోర్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు మూడు దఫాల్లో రూ.374 కోట్ల నిధులు సమీకరించామన్నారు.

➡️