విభిన్న నృత్య రూపాలతో ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్‌ సేఫ్టీ వీడియో వైరల్‌

Feb 24,2024 13:06 #air india, #Inflight Safety Video

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఎయిరిండియా తాజాగా కొత్త ఇన్‌ఫ్లైట్‌ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ప్రయాణీకుల కోసం ‘సేఫ్టీ ముద్ర’ అనే కొత్త ఇన్‌ఫ్లైట్‌ సేఫ్టీ వీడియోను ఎయిరిండియా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇక ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘శతాబ్దాలుగా భారతీయ శాస్త్రీయ నృత్యం, జానపద కళా రూపాలు, కథలు సూచనల మాధ్యమంగా పనిచేశాయి. అవి ఇప్పుడు విమాన భద్రత గురించి మరో కథను చెబుతాయి. భారతదేశంలోని గొప్ప విభిన్న నృత్య సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన ఎయిర్‌ ఇండియా కొత్త సేఫ్టీ ఫిల్మ్‌ని పరిచయం చేసింది.’ అని జోడించింది.

మెకాన్‌ వరల్డ్‌గ్రూప్‌కు చెందిన ప్రసూన్‌ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌, డైరెక్టర్‌ భరతబాల సంయుక్తగా ‘సేఫ్టీ ముద్రాస్‌’ను తీసుకొచ్చారు. ఈ వీడియోలో భరతనాట్యం, బిహు, కథక్‌, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్‌, గిద్దా, ఎనిమిది విభిన్న నత్య రూపాలను ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా ఈ వీడియోను తీర్చిదిద్దడం సంతోషదాయకమని ఎయిరిండియా సీఎంవో, ఎండి, కాంప్‌బెల్‌ విల్సన్‌ అన్నారు. ఈ సేఫ్టీ వీడియో ఎ350 ఎయిర్‌క్రాఫ్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో అత్యాధునిక ఇన్‌ఫ్లైట్‌ ఎంటరైన్‌మెంట్‌ స్క్రీన్లు ఉంటాయి. ఎయిరిండియా అన్ని విమానాలకు ఈ సేఫ్టీ వీడియో యాక్సెస్‌ అయ్యేలా టాటా కంపెనీ చర్యలు తీసుకోనుంది.

➡️