నాలుగు నెలలుగా జీతాల కోసం నిరీక్షణ

Apr 7,2024 00:02

నాలుగు నెలలుగా జీతాల కోసం నిరీక్షణప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పని చేసే సెక్యూరిటీ సిబ్బంది నాలుగు నెలలుగా జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. సకాలంలో వేతనాలు ఇవ్వక పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆకలితో విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి ఏర్పడింది. మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాల సమయంలో వీరికి అదనపు డ్యూటీలు వేశారు. ముక్కంటి ఆలయంలో ప్రస్తుతం 185మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. వీరంతా వేతనాలు రాక అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది. నెలనెలా రూ.కోట్లు ఆదాయం వస్తున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించక పోవడం బాధాకరం. ఇందులో ఏజెన్సీ వారి సమస్య కూడా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ముక్కంటి ఆలయ అధికారులు ఇకనైనా స్పందించి సెక్యూరిటీ సిబ్బందికి వేతనం చెల్లించాల్సి ఉంది.

➡️