అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నా : వివేక్‌ రామస్వామి

వాషింగ్టన్‌ (అమెరికా) : అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరపున ఉన్న భారతీయ- అమెరికన్‌, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి తాను రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్‌ ఎన్నికల్లో వివేక్‌ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో రామస్వామి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదే సమయంలో మాజీ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తొలి విజయాన్ని అందుకున్నారు.

➡️