దంగేరు-శివల మెయిన్ రోడ్డు పనులను అడ్డుకున్న గ్రామస్తులు

Feb 15,2024 15:02 #Konaseema
  • 7 మీటర్ల రోడ్డును 5 మీటర్లకుకుదించటంపై కాంట్రాక్టర్ తో వాగ్వాదం
  • పరిశీలించిన ఆర్ అండ్ బి డి ఈ. సూర్యనారాయణ

ప్రజాశక్తి రామచంద్రపురం(అంబేద్కర్ కోనసీమ): కే గంగవరం మండలంలోని ఎర్ర పోతవరం నుండి శివల మీదుగా దంగేరు వరకు ఆధునికరిస్తున్న మెయిన్ రోడ్డు పనులను శివల, దంగేరు సరిహద్దులో గ్రామస్తులు అడ్డుకున్నారు. కేంద్ర రోడ్డు అభివృద్ధి నిధుల నుండి మూడు రోడ్లకు కలిపి 20 కోట్లు మంజూరు కాగా ఈ రోడ్డుకు సుమారు మూడు కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఎర్ర పోతవరం నుండి సేవలు వరకు ఏడు మీటర్లు లో రోడ్డు నిర్మించారు. ఇక సెలవు నుండి దoగేరు వరకు రోడ్డును ఐదు మీటర్లకు కుదించారు. శివ నుండి దగ్గరి వరకు గల రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు ఒకవైపు పంటచేలు మరోవైపు పంట కాలువ ఉండడంతో దీనిని ఐదు మీటర్లకు కుదించారు. విషయం తెలుసుకున్న దంగెరు శివల గ్రామస్తులు గురువారం మెయిన్ రోడ్డు పై కూర్చుని పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ నాగిరెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు డి ఈ సూర్యనారాయణ, జే. ఈ కిషోర్ సంఘటన స్థలానికి వచ్చి రెండు గ్రామాల ప్రతినిధులతోనూ చర్చించారు. అయితే గ్రామస్తులు ఈ రోడ్డు మొత్తం ఏడు మీటర్లు నిర్మించాలని పట్టుపట్టారు. ఎప్పటికీ రోడ్డు పనులు ఆలస్యం అయ్యాయని నిధులు సరిపోవడం లేదని కాంట్రాక్టర్ తో పాటు ఆర్ అండ్ బి అధికారులు గ్రామస్తులకు సూచించారు. అదేవిధంగా కాలవైపు పంటసీల వైపు రోడ్డు విస్తరణ చేయడానికి వీలు కలగడం లేదని ఈ సందర్భంగా వారు వివరించారు. అయితే నిధులు ఎంతవరకు వచ్చినా రోడ్డు మాత్రం ఏడు మేటర్లు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని లేదంటే రోడ్డు పనులు నిలిపివేయాలని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని డి ఈ సూర్యనారాయణ హామీ ఇచ్చారు. ఇలాగ సర్వేలను పిలిచి ఏడు మీటర్లు ఎక్కడకొస్తుందో సర్వే చేసి మక్కులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దంగేరు గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, శివల సర్పంచ్ అనసూరి సాయిబాబు, కుడుపూరు సర్పంచ్ పిల్లి రాంబాబు, వ్యవసాయ సలహా మండల చైర్మన్ ఇళ్ళ సూర్య నారాయణ, దంగేరు ఎంపిటిసి కొప్పిశెట్టి లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు బలుసు శివప్రసాద్, సుబ్బు, శివల, దంగేరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️