గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

Feb 3,2024 15:53 #Tirupati district
village bandh in feb 16

 సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-కోట : కోట మండల కేంద్రంలో ఆటో వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు బి.గోపాలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఐక్యంగా ఉండాలని చదువుతో నిమిత్తం లేకుండా లైసెన్సులు బ్యాడ్జీలు ఇవ్వాలని ఆటో స్టాండ్లు ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అలాగే ఫిబ్రవరి 16న జాతీయస్థాయిలో సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ జరుగుతుందని బంద్ ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ఆపాలని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని అన్ని రకాల వస్తువులపై జిఎస్టి తొలగించాలని డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బి.గోపాలయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. కార్మికుల ఐక్యంగా ప్రజా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన తెలిపారు. ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడమే కేంద్రంలో బిజెపికి అలవాటుగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్లపూడి రమణయ్య, హరినాథ్ ఆటో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️