Election campaign… విజయసాయి రెడ్డికి చేదు అనుభవం

నెల్లూరు : ఎన్నికల ప్రచారం వేళ … వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో ఎన్నికల ప్రచార వాహనంపై విజయసాయి రెడ్డి ప్రసంగిస్తుండగా … జనం లేచి వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ప్రసంగం సమయంలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. విజయసాయి రెడ్డికి వెనుకనే నిలుచున్న నేత వెంటనే మైకులో అనౌన్స్‌ చేస్తూ …. ” మహిళలంతా వెళ్లిపోతున్నారు … పెద్దాయన మాట్లాడుతున్నారు… అందరికీ భోజనాలున్నాయమ్మా … వెళ్ళద్దు … ” ‘చెప్పేది వినండి, వెనక్కి రండి.. ఇటు చూడండి. వెళ్లిపోయేవాళ్లంతా మాకు కనిపిస్తున్నారు. మీరు పోవద్దు’ అని మైక్‌లో పదేపదే అనౌన్స్‌ చేశారు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.

➡️