విలన్‌ పాత్రలకు విజయ్ సేతుపతి గుడ్‌ బై

Nov 24,2023 12:12 #movie, #Vijay Sethupathi

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజరుసేతుపతి విలన్‌ పాత్రల్లో నటించనని షాకింగ్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. విజరు విలన్‌ పాత్రలకు గుడ్‌ బై చెప్పడంతో దర్శక నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గోవాలో జరిగిన ‘ఇఫి’ వేడుకలో విజరు సేతుపతి మాట్లాడుతూ.. ‘నాకు విలన్‌ పాత్రలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నాతో విలన్‌ పాత్రలు చేయిస్తున్న దర్శకులు, హీరోలు నన్ను ఎమోషనల్‌గా ఎంతో ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీంతో..నేను వారు చెప్పినట్లుగానే చేయాల్సి వస్తుంది. వారు అలా ఎమోషనల్‌గా ప్రెజర్‌ చేస్తున్న సమయంలో ఏది కరెక్ట్‌.. కాదో.. తేల్చుకోలేక సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాను. అందుకే నేను కొన్నాళ్లపాటు విలన్‌ వేషాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికి కమిట్‌ అయిన సినిమాలను పూర్తిచేసి, కొత్తవాటికి ఓకే చెప్పను’ అని అన్నారు. కాగా, విజరు తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించారు. అలాగే ‘విక్రమ్‌’ సినిమాలో కమల్‌కి ధీటుగా, ‘జవాన్‌’లో షారుఖ్‌తో పోటాపోటీగా విలన్‌ పాత్రల్లో నటించి మెప్పించారు.

➡️