పశు వైద్య క్లస్టర్ విధానం రద్దు చేయాలి

Dec 23,2023 11:50

ప్రజాశక్తి – బాపట్ల
గ్రామాల్లో పశు వైద్యశాలలకు ప్రభుత్వం తెచ్చిన క్లస్టర్ నిర్ణయంతో పశు వైద్యాలల ఉనికి కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ నాన్ గ్యాడ్యుయేట్‌ వెటర్నయన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఆర్‌వి సారధి అన్నారు. స్థానిక ఎన్జీఒ హోంలో శుక్రవారం జరిగిన నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నయన్స్ ఫెడరేషన్ నూతన అడ హక్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారా వెటర్నరీ సిబ్బందిని ఒత్తిడికి గురిచేస్తుందని అన్నారు. వారి సేవలను కించపరిచే విధంగా పశు వైద్యంలో అనేక మార్పులు చేశారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందికరంగా మారుతోందని అన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. క్లస్టర్ వ్యవస్థ నుండి గ్రామీణ పశువైద్యశాలల ఉనికిని కాపాడాలని కోరారు. ఈ అంశంపై పారా వెటర్నరీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపై ఉన్నారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే సంఘం నిర్ణయం ప్రకారం ఆందోళన చేయాల్సి వస్తుందని అన్నారు. సమావేశంలో నాయకులు రంజిత, రాజేష్, పాండురంగారావు, బిఆర్ వరప్రసాద్, శివ ప్రసాద్, బెనర్జీ, బి వెంకటేశ్వరరావు, శివ సుబ్బారావు పాల్గొన్నారు.

➡️