గాలికుంటు వ్యాధికి టీకాలు తప్పనిసరి

Jan 2,2024 14:16 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధికి టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని పశుసంవర్ధక శాఖ రాజంపేట ఉప సంచాలకులు డాక్టర్ వై.విజయ్ భాస్కర్ రావు తెలిపారు. రాజంపేట పట్టణంలో ఆయన సోమవారం జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు పాడి పశువులకు ఈ సందర్భంగా టీకాలు వేయించారు. ఈ సందర్భంగా విజయభాస్కరరావు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వలన పాల దిగుబడి తగ్గిపోవడంతో రైతులు అధికంగా నష్టపోతారని, రాజంపేట డివిజన్ పరిధిలో రెండు మరియు మూడవ తేదీలలో ఏడు మండలాలలోనూ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కే.ప్రతాప్, జె బి ఓ ఎం.వరదయ్య, బి.హరిబాబు పాల్గొన్నారు.

➡️