యునైటెడ్‌ కప్‌ విజేత జర్మనీ

Jan 9,2024 08:33 #Sports
  • ఫైనల్లో పోలండ్‌పై 2-1తో గెలుపు

సిడ్నీ: యునైటెడ్‌ కప్‌ టైటిల్‌ను జర్మనీ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీ 2-1తేడాతో పోలండ్‌పై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో టాప్‌సీడ్‌ ఇగా స్వైటెడ్‌(పోలండ్‌) 6-3, 6-1తో కెర్బర్‌(జర్మనీ)ను చిత్తుచేసింది. దీంతో జర్మనీ 0-1తో వెనుకబడింది. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌(జర్మనీ) 6-7(3-7), 7-6(8-6), 6-4తో హుబర్ట్‌ హుర్క్‌రాజ్‌(పోలండ్‌)పై చెమటోడ్చి నెగ్గడంతో 1-1తో సమమైంది. ఇక నిర్ణయాత్మక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్టెజ్మండ్‌-జ్వెర్వ్‌ే(జర్మనీ) జోడీ 6-4, 5-7(10-4)తో టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌-హుర్క్‌రాజ్‌ను ఓడించాడు. విజేత జర్మనీ జట్టుకు 49,830డాలర్లు, రన్నరప్‌ పోలండ్‌ జట్టుకు 31,650డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది.

➡️