వివాదాస్పద యుసిసిని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్‌

డెహ్రాడూన్‌ :    ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వివాదాస్పద ఏకరూప పౌరస్మృతి బిల్లు (యుసిసి)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి మంగళవారం ఈ బిల్లుని అసెంబ్లీలో  ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. వివాదాస్పద బిల్లుపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశాయి. బిల్లులోని నిబంధనలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం ఇవ్వలేదని పేర్కొన్నాయి. దీంతో శాసనసభ సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ చర్చ లేకుండానే బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్ష నేత యశ్‌పాల్‌ ఆర్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు యుసిసి బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.

➡️