బకాయిల సాధన కోసం యుటిఎఫ్‌ 12 గంటల ధర్నా

Jan 4,2024 17:19 #Kakinada

ప్రజాశక్తి – కాకినాడ : ఆర్థిక బకాయిలు చెల్లించాలంటూ యుటిఎప్‌ ఆధ్వర్యంలో గురువారం 12 గంటల ధర్నా చేపట్టారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షలు నగేష్‌ ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆడిట్‌ కమటీ జిల్లా కన్వీనర్‌ ఐ.ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకఉ రావాల్సిన పిఎఫ్‌, ఎపి జిఎల్‌ఐ రుణాలు, సరెండర్‌ లీవ్‌ల సొమ్ములు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తాము దాచుకున్న డబ్బులు తమ అవసరాలకు ఇమ్మంటే ఏళ్లుగా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతుందని తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ.. కనీసం 1వ తేదీకి జీతాలు ఇవ్వాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్వి టి.అన్నారాం మాట్లాడుతూ.. ఇకనైనా ప్రభుత్వం బకాయిలు చెల్లించడానికి ముందుకు రావాలన్నారు. లేకుంటే ఈనెల 9,10 తేదీల్లో విజయవాడలో 36 గంటల ధర్నాను ఉర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి 600 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షలు సాయిరాం, జిల్లా కార్యదర్శులు పెద్దిరాజు, వివి.రమణ, సత్తిబాబు, బి.నాగమణి, పివి.సత్యనారాయణ, వీరబాబు, సూరిబాబు, గోవిందరాజు పాల్గొన్నారు.

➡️