అమెరికాలో ఒక్క జనవరిలోనే పదినెలల గరిష్టానికి ”లే ఆఫ్స్‌”

Feb 2,2024 16:15 #America, #job cuts

వాషింగ్టన్‌ :    అమెరికాలో జనవరి నెలలో ఉద్యోగుల తొలగింపులు  రెండింతల కన్నా అధికమయ్యాయి.  ఉద్యోగుల కోతలు ఒక్క జనవరిలోనే    పదినెలల గరిష్టానికి చేరాయి.   2024 జనవరి నెలలో 82,307మంది ఉద్యోగులను తొలగించగా, డిసెంబర్‌లో 34,817 మందితో పోలిస్తే 136 శాతం పెరిగినట్లు తెలిపింది. గతేడాది మార్చి అనంతరం ఇదే అత్యధిక నెలవారీ మొత్తంగా పేర్కొంది.

ఛాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ అవుట్‌ ప్లేస్‌మెంట్‌ సంస్థ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన, ప్రకటించిన ఉద్యోగ కోతలు జనవరి 2023 నుండి 20 శాతం తగ్గాయి. ఆర్థికరంగంలో 23,238 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా, ఇది అంతకుముందు సంవత్సరం కంటే రెండింతలు అధికం.

నిర్వహణ ఖర్చుల తగ్గింపు, యాంత్రికీకరణ, కృత్రిమ మేథస్సు (ఎఐ) వంటి చర్యలతో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఛాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రూ చాలెంజర్‌ తెలిపారు. జనవరి నెలలో ఆర్థిక, సాంకేతిక రంగాల్లో అధికంగా ఉద్యోగుల తొలగింపుల ప్ర కటనలు వెలువడ్డాయని అన్నారు. ప్లాంట్లు, యూనిట్ల మూసివేత, పునర్‌నిర్మాణ చర్యలతో ఉద్యోగాలపై కోత పడిందని పేర్కొంది.

అమెజాన్‌, అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అతిపెద్ద టెక్‌ సంస్థలు కూడా ఉద్యోగుల కోతలను ప్రకటించాయి. యునైటెడ్‌ పార్సిల్‌ సర్వీస్‌ సంస్థ సుమారు 12,000మందని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పేపాల్‌ హోల్డింగ్స్‌ ఇంక్‌ తమ వర్క్‌ఫోర్స్‌లో 9 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలెక్స్‌ క్రిస్‌ జనవరి 30న ప్రకటించారు.

➡️