నేను ఓ సూపర్‌ ఉమెన్‌ని పెళ్లాడాను : అక్షయ్ కుమార్‌

Jan 17,2024 15:56 #movie, #Twinkle Khanna

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటి ట్వింకిల్‌ ఖన్నాను సూపర్‌ ఉమెన్‌ అని తన భర్త అక్షరుకుమార్‌ ప్రశంసించారు. తాను ఓ సూపర్‌ ఉమెన్‌ని పెళ్లాడానని సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ట్వింకిల్‌ ఖన్నా లండన్‌లో గోల్డ్‌స్మిత్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. దీనికి సంబంధించి తాజాగా ట్వింకిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో గోల్డ్‌స్మిత్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తలపై పెట్టుకున్న టోపీని ట్వింకిల్‌ పైకి ఎగరేస్తున్న ఫొటోతోపాటు, తన భర్త అక్షయ్ కుమార్‌తో కలిసి దిగిన ఫొటోలు కనిపిస్తాయి. ఈ వీడియోకు జతగా ‘నా కుటుంబం నాతో ఉండడం వల్ల ఈరోజు నేను ఊహించిన దానికంటే మరింత పరిపూర్ణంగా మారింది. మనం ఎదగడానికి ఒక మార్గం అడ్డుగా ఉన్నప్పుడు.. ఇతర అనేక మార్గాల్లో ఎదిగేందుకు మనం కృషి చేయాలి.’ అని ఆమె క్యాప్షన్‌ రాశారు. దీంతో ప్రీతిజింటా, కరిష్మా కపూర్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు ట్వింకిల్‌ ఖన్నాకు విషెస్‌ తెలిపారు. అలాగే ఆమె భర్త అక్షయ్ కుమార్‌ ట్వింకిల్‌ను అభినందిస్తూ ఓ పోస్టు పెట్టారు.

‘రెండేళ్ల క్రితం నువ్వు మళ్లీ చదువుకోవాలనుకుంటున్నానని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కానీ మీరు ఓ విద్యార్థిగా చదువుకుంటూనే ఇంటిని, నన్ను.. పిల్లల్ని, కెరీర్‌ని వీటన్నింటిని ఎంతో చక్కగా మేనేజ్‌ చేశారు. నాకు తెలుసు.. నేను ఓ సూపర్‌ ఉమెన్‌ని పెళ్లి చేసుకున్నాను అని..! మీరు నన్ను ఎంత గర్వించే భర్తను చేశారో చెప్పడానికి తగినన్ని పదాలను తెలుసుకోవడానికి నేను ఇంకొంచెం ఎక్కువ చదువుకుని ఉంటే బాగుండేది టీనా.’ అని అక్షయ్ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అక్షయ్, ట్వింకిల్‌ ఖన్నాలిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆరవ్‌, నితారా అనే ఇద్దరు పిల్లలున్నారు.

 

➡️