సౌత్‌ కరోలినా ప్రైమరీ ట్రంప్‌ కైవసం

Feb 26,2024 10:45 #Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోరులో మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది డొనాల్డ్‌ ట్రంప్‌ సౌత్‌ కరోలినా ప్రైమరీని కైవసం చేసుకున్నాడు.ఈ పోరులో తన సమీప ప్రత్యర్థి నికీ హేలీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా ఆగేయ రాష్ట్రమైన ఈ మితవాద, మతవాద రాష్ట్రంలో ట్రంప్‌ 60శాతం ఓట్లు సాధించాడు. దీంతో ట్రంప్‌ ఖాతాలో ఇప్పటివరకు అయిదు ప్రైమరీస్‌ జమ అయింది. ఇంతకుముందు అయోవా, న్యూహాంప్‌షైర్‌, విర్జిన్‌ ఐలాండ్స్‌, నెవడా గెలుచుకున్నాడు. ట్రంప్‌ దూకుడు చూస్తుంటే వచ్చే నవంబరు5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌కు ప్రత్యర్థిగా రిపబ్లికన్‌ పార్టీ తరపున ట్రంప్‌ తలపడడం ఖాయమని అనిపిస్తోంది.

➡️