ఎన్.బి.కే.ఆర్ లో అధ్యాపకులకు శిక్షణా తరగతులు

Jan 29,2024 15:37 #Tirupati district
training classes for teachers in nbk rist

ప్రజాశక్తి-కోట : కోట మండలంలోని స్థానిక ఎన్.బి.కే.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వాద్వానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “ఎంప్లాయబులిటీ స్కిల్స్” అనే అంశంపై అధ్యాపకులకు మూడు రోజుల శిక్షణ సదస్సును కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి. విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వాద్వానీ ఫౌండేషన్ తరపున మాస్టర్ ట్రైనర్ స్వాతి పుత్రన్ వ్యవహరించారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ ఎన్.బి.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మరియు వాద్వానీ ఫౌండేషన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ అధ్యాపక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు కావలసిన ఉద్యోగ నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు అవసరమైన శిక్షణను అధ్యాపకులకు అందిస్తారని తెలియజేశారు.శిక్షణ పొందిన అధ్యాపకులు 3 మరియు 4 సంవత్సర చదువుతున్న విద్యార్థుల అందరికీ తర్ఫీదు ఇస్తారని తెలిపారు. ఈ శిక్షణ కు 60 మంది ఉాధ్యాయులు ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్వాతి పుత్రన్ మాట్లాడుతూ వాద్వానీ ఫౌండేషన్ గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను వేగవంతం చేయడం మరియు తద్వారా వారి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి కావలసిన మెలకువలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ శిక్షణ పూర్తి చేసిన అధ్యాపకులకు గ్లోబల్ సర్టిఫికేషన్ అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికాలోని భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మశ్రీ గ్రహీత డాక్టర్ రమేష్ వాద్వానీ ఈ ఫౌండేషన్ను నెలకొల్పారని దీని ద్వారా ఆఫ్రికా,ఏషియా మరియు లాటిన్ అమెరికాలోని వివిధ దేశాల్లో ఎంట్రప్రెన్యూర్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, ఎంప్లాయబులిటీ స్కిల్స్ వంటి తదితర అంశాల్లో ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నిరంతర శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటివరకు 1000 విద్యాసంస్థల్లో సుమారు లక్ష 50 వేల మంది విద్యార్థులకు మరియు 5000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మెకానికల్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎస్ ఇందుమతి మరియు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

➡️