నాంపల్లిలో రైలు ప్రమాదం.. రైల్వే శాఖ కీలక ప్రకటన

Jan 10,2024 10:59 #Acident, #Indian Railways, #nampalli

హైదరాబాద్‌ : నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నాంపల్లి చివరి స్టేషన్‌ కావడంతో ప్రమాదం తప్పినట్లు పేర్కొంది. రైలు ప్రమాదానికి కాసేపటి క్రితమే చాలా మంది ప్రయాణికులు దిగారని తెలిపింది. కొంత మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయని పేర్కొంది. ఇక, ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణీకులకు గాయాలు కాగా లాలా గూడ రైల్వే ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. మూడు భోగీలు పట్టాలు తప్పగా.. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి పట్టాలపైకి చేర్చి మిగతా రైళ్ల రాకపోకలు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ట్రాక్ ను పునరుద్ధరించి, రైళ్లను యథావిధిగా నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు వివరించారు.

➡️