ఇక స్థానిక భాషల్లోనూ ట్రేడింగ్‌-సెబీ చీఫ్‌ ఆవిష్కరణ

Jan 19,2024 21:10 #Business

ముంబయి : స్టాక్‌ మార్కెట్లలో సులభ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి వీలుగా సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా) (సిడిఎస్‌ఎల్‌) అందుబాటులోకి తెచ్చిన బహుళ భాషలను సెబీ ఛైర్‌పర్సన్‌ మదాబి పూరి బుచ్‌ ఆవిష్కరించారు. ఇన్వెస్టర్లు ఇకపై 23 భారతీయ భాషల్లో తమ ట్రేడింగ్‌ స్టేట్‌మెంట్లను పొందడానికి వీలు కల్పించనుంది. డిమ్యాట్‌, సెక్యూరిటీ ఖాతాల్లో ఇన్వెస్టర్లు తమకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు. తొలుత నాలుగు భాషలతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అతి త్వరలోనే క్రమంగా అన్ని స్థానిక భాషలు అందుబాటులోకి రానున్నాయి.

➡️