Tomorrow హోలీ – తెలంగాణలో పాఠశాలలకు సెలవు

తెలంగాణ : రేపు హోలీ పండుగను పురస్కరించుకొని …. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించింది. గుడ్‌ ఫ్రైడే రోజున హైదరాబాద్‌ లోని పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఈ ఏడాది మార్చి 29న సాధారణ సెలవు దినంగా ప్రకటించారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలకు మార్చి 31న ఐచ్ఛిక సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణతో సహా భారతదేశం అంతటా హోలీ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీను పురస్కరించుకొని పలు చోట్ల కామ దహనం కార్యక్రమం జరుగుతోంది. హౌళిక అనే రాక్షసుడిని దహనం చేసినందుకు సంబరాలు చేసుకోవడానికి మంటలు వెలిగిస్తారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, ద్ణుఖంపై ఆనందం సాధించిన విజయాన్ని హోలీ గుర్తు చేస్తుంది. హోలీకి ముందు రోజు రాత్రి నార్త్‌ ఇండియాతోపాటు పలు ప్రాంతాల ప్రజలు ఈ సాంప్రదాయానికి అనుగుణంగా కామ దహనం చేస్తారు. ఇది వసంతాన్ని జరుపుకునే రంగుల పండుగగా అంతా జరుపుకుంటారు.

➡️