రేపు ‘భజే వాయు వేగం’ టీజర్‌

Apr 19,2024 19:10 #movie

యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌ మీద కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న తాజా సినిమా ‘భజే వాయు వేగం’. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హ్యాపీ డేస్‌ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్‌ రాజు.పి.కో ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శుక్రవారం చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ అనౌన్స్‌ మెంట్‌ చేసింది. శనివారం మధ్యాహ్నం టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

➡️