ఆటో, క్యాబ్‌లపై ఈ-చలానాలను రద్దు చేయాలంటూ.. రిలే నిరాహారదీక్షలు

Feb 23,2024 13:55 #autos, #cabs, #e-challanalu, #Strikes

ఏలూరు : ఆటో, క్యాబ్‌ వాహనాలపై ఈ-చలానాలు విధించడానికి నిరసనగా … శుక్రవారం ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌వారు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్‌ జీపుల స్టాండ్‌ వద్ద రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఆటో, క్యాబ్‌లపై ఈ చలానాలను రద్దు చేయాలని, స్టాప్‌ లైన్‌, సిసి కెమెరాలను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేశారు.

➡️