అత్యంత అరుదైన శస్త్రచికిత్స

Dec 4,2023 14:54 #Health Sector, #Kidney, #Vizianagaram
tirumala health

100కు పైగా రాళ్ళు తొలగింపు
ప్రజాశక్తి-విజయనగరం కోట : తిరుమల మెడికల్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు తిరుమల మెడికవర్ అధినేత డాక్టర్ కె.తిరుమల ప్రసాద్ వెల్లడించారు. సోమవారం నాడు స్థానిక హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ ధమన్ జోడికి చెందిన పూల్ కుమారి దేవి 69సంవత్సరాల వయస్సు ఆమె తీవ్రమైన దీర్ఘకాలిక 17సంవత్సరాల నుంచి కడుపు నొప్పి, ఇతర లక్షణాలతో భాదపడుతూ నవంబర్ 29న హాస్పిటల్ వచ్చారన్నారు. హాస్పిటల్ నందు స్కాన్ చేసి చూడగా ఆమెకు పిత్తాశయంలో రాళ్లు ఇన్ఫెక్షన్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. కోత లేకుండా లాపరోస్కోపిక్ కోల సిస్టెక్టమీ శస్త్ర విజయవంతంగా చేయడం జరిగిందన్నారు.ఆ మహిళ కడుపులో నుండి 17×5cm సైజు వరకు పెరిగి పిత్తాశయం(gall bladder) అందులో నుంచి 100కు పైగా పిత్తాశయం రాళ్లు తీయడం జరిగిందన్నారు. ఆపరేషన్ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నార న్నారు. ఈమెకు కొంత కాలం క్రితం క్యాన్సర్ శస్త్ర చికిత్స, కీమోథెరపీ జరిగిన క్లిష్టమైన నేపథ్యంలో కూడా తిరుమల ప్రసాద్ శస్త్ర చేసినట్లు తెలిపారు.లెపరోస్కోపీ శస్త్ర చికిత్స లో 36సంవత్సముల అపారమైన అనుభవంతో చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ తర్వాత మహిళ పూర్తిగా కోలుకున్నారన్నారు. ఇటువంటి వ్యాదులు ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఎక్కవగా వాడడం, పాస్టపుడ్ ఎక్కువ గా తినడం, అతిగా తినడం ద్వారా వస్తాయన్నారు . దేవి కుమారుడు మాట్లాడుతూ డా. తిరుమల ప్రసాద్ ఈ ఆపరేషన్ మా అమ్మకు విజయవంతంగా చేయడం వలన మా అమ్మ ప్రాణాలు కాపాడారన్నారు. గత 17ఏళ్ళగా వైజాగ్ , బెంగుళూరు, చెన్నై ఇతర ప్రాంతాల్లో డాక్టర్లు కు చూపించినా ప్రయోజనం జరగలేదన్నారు. కాని డా. ప్రసాద్ ఆపరేషన్ చేయడం వలన మా అమ్మ మాకు దక్కిందన్నారు. ఈసందర్బంగా ఐఎంఎ, విజయనగరం డాక్టర్స్ తిరుమల ప్రసాద్ ను అభినందించారు. ఈ కార్య క్రమంలో ఏఓ సిహెచ్.మహేష్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️