ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. దూడపై దాడి

Jan 30,2024 15:21 #Eluru district, #Tiger

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల మండలం రామ సింగవరం శివారులో దూడపై పెద్దపులి దాడి చేసింది. దూడను చంపి సమీప అడవిలోకి లాక్కు వెళ్లడాన్ని రైతు గుర్తించాడు. పులి దాడి చయడాన్ని చూసిన రైతు భయంతో చెట్టెక్కిన స్థానిక రైతు గ్రామస్తులకు, అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు అనుమతి లేకుండా పొలాల్లోకి వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు. పాద ముద్రలను బట్టి పులి ప్రస్తుతం పుల్లలపాడు అడవిలో ఉన్నట్లు భావిస్తున్నారు. పులి సంచారంతో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.

➡️