అలిపిరి బాంబు దాడి కేసులో నిర్దోషులుగా ముగ్గురు నిందితులు

Dec 16,2023 12:18 #Acident, #alipiri, #Nara Chandrababu
  • అక్టోబరు 2023లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి
  • తీవ్రగాయాలతో బయటపడిన చంద్రబాబు

ప్రజాశక్తి-చిత్తూరు :ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 4వ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. 2003 అక్టోబర్లో సీఎం హోదాలో తిరుమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ నక్సలైట్‌ లు రాంమ్మోహన్‌ రెడ్డి, నరసింహ రెడ్డి, చంద్రలను దోషులుగా నిర్దారిస్తూ.. 2014 లో కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితులకు 4 ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 9ఏళ్లుగా ఈ కేసులో వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో డిసెంబర్‌ 15వ తేదీ శుక్రవారం ముగ్గురు ముద్దాయిలను నిర్దోషిలుగా కోర్టు తీర్పు వెలువరించింది.ఇదే కేసులో గతంలో కడప జిల్లాకు చెందిన ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డి, జోతెం నాగార్జున, కొల్లం గంగిరెడ్డి, ఎన్‌.పాండురంగారెడ్డికి కింది కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును వారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత కేసు తిరుపతిలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టుకు బదిలీ అయింది. విచారణ అనంతరం 2012లో గంగిరెడ్డి, పాండురంగారెడ్డి నిర్దోషులుగా విడుదల కాగా, రామస్వామిరెడ్డి, నాగార్జునపై రివిజన్‌ పిటిషన్‌ హైకోర్టులో పెండింగులో ఉంది.

➡️