covid: ప్రభావం కొనసాగుతూనే ఉంది!

ప్రపంచం, కోవిడ్‌ ముప్పు నుండి బయటపడి చాలా కాలమైంది. కానీ ఇప్పటికీ ఎక్కడో ఓ చోట కోవిడ్‌ తాలూకు భయాలు, దాని చుట్టూ అల్లుకున్న సర్వేలు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటున్నాయి. తాజాగా సైన్స్‌ పత్రిక లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించిన ఓ సర్వే వివరాలు చూస్తే, కోవిడ్‌ కాలంలో అంటే 2019 – 21 మధ్య కాలంలో ప్రపంచ జనాభా జీవితకాలం 1.6 సంవత్సరాల క్షీణతకు లోనైంది.
కోవిడ్‌ విస్తృతంగా వ్యాపించిన మొదటి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనాన్ని వెల్లడించారు. ఈ సర్వే ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య జనాభా పెరుగుదలను కూడా సూచించింది. ప్రపంచ మొత్తం దేశాల్లో 84 శాతం దేశాలు, భూభాగాÛల్లో ఆయుర్దాయం క్షీణించ డానికి ఇది కూడా ఒక కారణంగా సర్వే తేల్చింది.
2020-21 కోవిడ్‌ సమయంలో సంభవించిన మరణాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు లాన్సెట్‌ అధ్యయన పరిశోధకులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు తగ్గినట్లు సర్వే చెబుతోంది. 2019తో పోల్చినప్పుడు 2021లో 50 వేల పిల్లల మరణాలు తగ్గాయని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో ప్రతి నలుగురిలో ఒకరు దక్షిణాసియాలో నివసిస్తున్నారని, మరణించిన ప్రతి నలుగురు పిల్లల్లో ఇద్దరు సహారా ఆఫ్రికాలో జీవిస్తున్నారని సర్వే తేల్చింది. ప్రాంతాలను బట్టి పిల్లల మరణాల్లో తేడాలున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అంచనాలు కోవిడ్‌-19, భవిష్యత్తులో దాని పరిణామాలపై లోతైన అధ్యయనాలు చేయడానికి దోహదపడ తాయని నిపుణులు తెలిపారు. ఇన్స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (×నవీజు), యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ (ఖఔ), ఖూ సమన్వయంతో పరిశోధన, గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ స్టడీ (+దీణ) 2021 నుండి నూతనీకరించిన అంచనాలను సర్వేలో సమర్పించారు.
కోవిడ్‌-19 రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 2019 నుండి 15 సంవత్సరాలు పైబడి ఉన్న వారిలో ప్రపంచ మరణాల రేటు పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం పెరిగిందని పరిశోధకులు అంచనా వేశారు.
2020-21లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ప్రజలు వివిధ కారణాల వల్ల మరణిం చారు. ఇందులో కోవిడ్‌ కోటీ 60 లక్షల మిలియన్ల మంది మరణాలకు కారణమైంది. ఈ మరణాలు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా, సామాజిక, ఆర్థిక కారణాల పరంగా అంచనా వేశారు.
జోర్డాన్‌, నికరాగ్వా వంటి స్వల్ప మరణాల రేటు కలిగిన ప్రాంతాల్లో కూడా కోవిడ్‌ సమయంలో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నట్లు బృందం గుర్తించింది. అలాగే బార్బడోస్‌, న్యూజిలాండ్‌, ఆంటిగ్వా, బార్పుడా దేశాల్లో కోవిడ్‌ మరణాలు అత్యల్పంగా సంభవించినట్లు సర్వే వెల్లడించింది.
ఈ సందర్భంగా ప్రపంచ జనాభా పెరుగుదలను కూడా సర్వే అంచనా వేసింది. 2021లో ప్రపంచ జనాభా దాదాపు 7.9 బిలియన్లకు చేరుకుందని పరిశోధకులు కనుగొన్నారు. 204 దేశాల్లో 56 దేశాలు, భూభాగాలు ప్రపంచ జనాభాలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా 2017 నుండి జనాభా పెరుగుదలలో స్తబ్ధత కనిపించింది. మహమ్మారి సమయంలో ఇది ఇంకా వేగవంతమైంది. తక్కువ ఆదాయాలు గల దేశాల్లో జనాభా పెరుగుదల వేగవంతమైనట్లు సర్వే గుర్తించింది. సబ్‌-సహారా ఆఫ్రికా (39.5శాతం), దక్షిణాసియా (26.3) శాతం పెరుగుదలను నమోదు చేసింది. 204 దేశాలు, భూభాగాల్లో 188 దేశాల్లో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారి సంఖ్య కంటే ఇప్పుడు ప్రపంచ జనాభా 65 ఏళ్ల కంటే పైబడిన వారితో నిండిపోయిందని పరిశోధకులు తెలిపారు. ఈ సంఖ్యను బట్టి ప్రపంచ వ్యాప్తంగా వృద్ధాప్యం గణనీయంగా వృద్ధి చెందిందని సర్వే తేల్చింది.

➡️