ఆక్వా రైతులకు సాంకేతిక అవగాహనా సదస్సు

Feb 24,2024 23:33

ప్రజాశక్తి – నిజాంపట్నం
స్థానిక తూనుగుంట్ల ఇంద్రగుప్తా, హేమంత్ ప్లాంట్ నందు ఆక్వా రొయ్య సాగు రైతులకు అవంతి ఫీడ్స్ లిమిటెడ్ తరపున జనరల్ మేనేజర్ ఎస్‌ మహంతి అధ్యక్షతన సాంకేతిక సదస్సు శనివారం నిర్వహించారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో శాస్త్ర బద్దంగా సమ పాళ్ళ పోషక విలువలతో తక్కువ ఖర్చుతో రైతులు ఎక్కువ ఆక్వా సాగు ఉత్పత్తిపై సాంకేతిక పద్దతి రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. రైతులకు యాజమాన్య పద్ధతుల్లో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఆక్వా సాగు ఎక్కువ చేసే దేశాలైన ధాయిలాండ్, చైనా, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల కన్నా మన దేశ నాణ్యత ప్రమాణాలు, పోషక విలువలు పెంపొదేటట్లు గుర్తింపు పొందిన ఫీడ్స్‌ను రైతులు ఉపయోగించుకుని అధిక లాభాలు గడించాలని సూచించారు. ధరలు వ్యత్యాసం గురించి ప్రభుత్వంతో ఇటీవల సంప్రదింపులు జరిపామని తెలిపారు. ప్రభుత్వం కూడా రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సానుకూలంగా స్పందించిందని తెలిపారు. కార్యక్రమంలో కె రంగారెడ్డి, ఎహెచ్‌సీపీ ప్రోడక్ట్ మేనేజర్ పి శ్రీనివాస్‌, టాస్ మేనేజర్ పిఎస్‌ఎన్ మూర్తి, గుంటూరు, కృష్ణా జిల్లాల రీజినల్ మేనేజర్ టి హేమంత్, అవంతి డీలర్ టి ఇంద్రగుప్తా, నిజాంపట్నం, అవంతి టెక్నికల్ టీం పాల్గొన్నారు.

➡️