ఒళ్లు విరిచి!

Mar 24,2024 08:57 #Poetry, #Sneha

తడి మట్టిని తాకి..
విత్తనం తానమాడి..
నిద్రాణ స్థితి నుంచి..
కళ్లు తెరిచి.. ఒళ్లు విరిచి..
త్యాగానికి పరాకాష్టగా..
దేహాన్ని చీల్చుకొని..
చీకటిని జయించి..
అంకురమై మొలిచి..
మట్టిని తన్నుకొని..
సత్తువను పీల్చుకొని..
భానుడి స్పర్శ తగిలి..
వేళ్లుగా భూమిలో దూరి..
ఆకసాన్ని ముద్దాడే..
ఆకులు, శాఖలుగా..
హరిత వస్త్రం ధరించి..
పువ్వులు, కాయలు..
కడుపు పండి..
తియ్యని ఫలాలుగా..
జీవులకే అన్నమై..
నీడనిచ్చే ఆవాసమై..
ఆకలి తీర్చే అమ్మయై..
గింజల సంతానాన్నిచ్చి..
పరహితమై కృశించి..
శిధిలమై మట్టిలో కలిసి..
హరిత భవితకు ఆధారమై..
జీవన సారాన్ని బోధించి..
ధన్యమయ్యింది వృక్ష జన్మం
బతుకు అర్థాన్ని నేర్పుతోంది..
నడమంత్రపు నవ్య నరుడికి !

  • మధుపాళీ, 9949700037
➡️