ఎర్నాకులం కదనరంగంలో టీచర్‌

Apr 24,2024 23:57 #CPM candidate

– ఉపాధ్యాయ ఉద్యమంలో
-చురుకైన పాత్ర
– మూడు సార్లు కౌన్సిలర్‌గా గెలుపు
– సిపిఎం అభ్యర్థి కెజె షైన్‌
బోధనారంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న కెజె షైన్‌ ఒక్క ఉపాధ్యాయ వృత్తికే పరిమితం కాలేదు. ఉపాధ్యాయ సంఘాల రంగంలో చురుకైన కార్యకర్తగా, జిల్లా కళా, సాంస్క్రుతిక రంగంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి దశ నుంచి ప్రజాసేవలో ఉన్నారు. ఉన్నారు. యుడిఎఫ్‌ కంచుకోటలను షేక్‌ చేస్తూ ప్రస్తుతం పరవూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌ కెజె షైన్‌ వరుసగా మూడోసారి విద్య, కళలు, క్రీడల స్టాండింగ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ గా కొనసాగుతున్నారు.
బోధనలో నైపుణ్యం
కొత్తాపురం డియోసెస్‌ కెసిఎస్‌ఎల్‌, కెసివైఎంలో పనిచేస్తున్నప్పుడు ఉత్తమ క్యాంపర్‌ అవార్డులను గెలుచుకున్న కెజె షైన్‌, తరువాత తన రంగంలో నిష్ణాతులకు పర్యాయపదంగా మారారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ సభ్యురాలిగా ఉంటూనే ప్రచార కార్యక్రమాలతో జిల్లాను హోరెత్తించారు. ఈఎంఎస్‌ లెర్నింగ్‌ సెంటర్‌కు ఉపన్యాసకులుగా ఉంటూ అర్థవంతమైన చర్చల వేదికలను సుసంపన్నం చేశారు. యుడిఎఫ్‌ ఆధిపత్యంలో ఉన్న పరవూరు మున్సిపాలిటీలోని రెండో వార్డు నుంచి వరుసగా మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. సిపిఎం పరవూరు టౌన్‌ ఈస్ట్‌ లోకల్‌ కమిటీ సభ్యలుగా కూడా ఉన్నారు. ఆమె కొత్తపురం డియోసెస్‌ పరిధిలోని పల్లిపురం సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలు, సమగ్ర శిక్ష కేరళలో శిక్షకురాలుగా ఉన్నారు. 2014-2017 కెఎస్టిఎ ఎర్నాకులం జిల్లా అధ్యక్షురాలిగా, 2018 నుండి రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఎఫ్‌ఎస్‌ఈటిఓ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పలు పట్టాలు
పాఠశాల, కళాశాల విద్య గోతురుత్‌ సెయింట్‌ సెబాస్టియన్స్‌ హైస్కూల్‌, కొడంగల్లూర్‌ సెయింట్‌ థామస్‌ కళాశాల, కొడంగల్లూర్‌ కెకెఎంటిలో పని చేశారు. పనంగాడ్‌ కృష్ణా టిటిఐ నుండి టిటిసి, మధురకామరాజ్‌ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు

➡️