తనికెళ్ల భరణికి జీవిత సాఫల్య పురస్కారం

Jan 7,2024 23:50

ప్రజాశక్తి – అద్దంకి
పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ జీవిత సాఫల్య పురస్కార సభకు డివిఎం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తన నటనతో అందరి మనసుల్లో నిలిచే పాత్రలు చేశారని అన్నారు. బాలభార్గవి ప్రార్థనా గీతంతో సభా ప్రారంభించారు. పుట్టంరాజు తాండవకృష్ణ పురస్కార గ్రహీత తనికెళ్ల భరణిని సభకు పరిచయం చేశారు. తనికెళ్ల భరణి సాహిత్యాన్ని ఆర్‌వి రాఘవరావు విశ్లేషించారు. తనికెళ్ల భరణి నటించిన చలన చిత్రాల్లో పాత్రల్లో పండించిన హాస్యాన్ని, విలనిజాన్ని సోదాహారణంగా సినీ విశ్లేషకుడు వారణాశి రఘురామశర్మ వివరించారు. ఎర్రన నడచిన అద్దంకి సీమలోని ప్రతి రేణువు శివమయమని, తెలుగు భాష ఓనమాలు దిద్దుకున్ననేలపై పురస్కార అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పురస్కార గ్రహీత తనికెళ్ల భరణి అన్నారు. సభలోని సభ్యులతో ముఖాముఖి జరిపారు. అందరినీ ఆకట్టుకునే విధంగా సమాధానాలు చెప్పారు. ట్రస్టు అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి, శైలజ, కుటుంబ సభ్యులు పుట్టంరాజు చక్రధర్, తాండవకృష్ణ, నంబూరి హనుమంతరావు, బాలభార్గవి పురస్కార ద్రవ్యం రూ.20వేలు, పట్టువస్త్రాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వీరవల్లి రుద్రయ్య, మురళీ సుధాకరరావు, కెవి పోలిరెడ్డి, చప్పిడి వీరయ్య, మలాది శ్రీనివాసరావు, జమ్మలమడక హనుమంతరావు, వామరాజు వెంకటేశ్వర్లు, ఓరుగంటి ప్రసాదరావు, లక్కరాజు విశ్వమోహన్, కొండకావూరి కుమార్, ఓరుగంటి శ్రీనివాసరావు, మిట్టా కామేశ్వరశర్మ, అద్దంకి లెవీప్రసాదు, సందిరెడ్డి శ్రీనివాసరావు, కంఠంరాజు శివరామ కోటేశ్వరరావు, కోలలపూడి శ్రీనివాసరావు, వఠ్యం సీతారామశాస్త్రి, కుందా సుబ్బారావు, గోపినాథం హరనాథ్, కూరపాటి రామకోటేశ్వరరావు, పసుపులేటి ఆంజనేయులు, అళహరి హరిబాబు, ఎన్‌ రాఘవ, పిఎల్‌వి నరసింహారావు, పిసిహెచ్ కోటయ్య, ధర్మవరపు సీతారామయ్య, జె ప్రతాప్, లక్కరాజు సాంబశివరావు పాల్గొన్నారు.

➡️