గోల్ప్‌లో ఢిల్లీ స్కూల్‌ విద్యార్ధుల ప్రతిభ

Mar 18,2024 23:52

ప్రజాశక్తి – చెరుకుపల్లి
సీనియర్ జాతీయ మినీ గోల్ఫ్ ఛాంపియన్ షిప్‌లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. మినీ గోల్ఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర మినీ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగపూర్లో 9వ సీనియర్ నేషనల్ మినీ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ జట్టు తరఫున ఏడుగురు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మీరందరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల చైర్మన్ పైనం ఏడుకొండలరెడ్డి తెలిపారు. పాఠశాల విద్యార్థి ఎం అఖిల్ సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రజిత పతకాన్ని కైవసం చేసుకున్నట్లు తెలిపారు. అఖిల్ సాయి అస్సాం, విదర్భ, ఛత్తీస్‌ఘడ్ జట్లపై గెలిచి ఫైనల్లో స్థానం పొందాడు. వ్యక్తిగత ఈవెంట్లో కేరళ, మధ్యప్రదేశ్ జట్టులపై గెలిచి రజిత పథకాన్ని కైవసం చేసుకున్నట్లు కోచ్ షోయబ్ అహ్మద్ తెలిపాడు. జాతీయ స్థాయిలో పతకాన్ని సాధించిన అఖిల్ సాయిని స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ గణేష్‌రెడ్డి, సాయి గణేష్‌రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఏ ప్రసాదరెడ్డి, ప్రిన్సిపాల్ నర్గీస్ క్యాజి, కోచ్ షోయబ్ అహ్మద్ అభినందించారు.

➡️