కొండ భూమిని తీసుకోవడం అన్యాయం

Mar 4,2024 15:14 #Vizianagaram

గొర్రెల, మేకల పెంపకం దార్లు
వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ
కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు గొర్రెలు, మేకలు పెంపకం దార్లు భూములు తీసుకోవడం అన్యాయమని, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట గొర్రెలు మేకలు పెంపకం దార్లుతో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దత్తిరాజేరు మండలం, చినచామలాపల్లి గ్రామ గొర్రెలు & మేకల పెంపకం వృత్తిదారులు ఈ వృత్తియే జీవనంగా బ్రతుకుతున్నారన్నారు. గ్రామంలో ఉన్న వారంతా గొర్రెలు మరియు మేకలు పెంపకం వృత్తిదార్లు, గ్రామ సర్వే నెంబర్లు 1,2,3,100,101లలో ఉన్న డి-పట్టా, సాగులో ఉన్న కొండపోరంబోకు, బంజరు మరియు ఫారెస్టు డిపార్ట్మెంటువారు మొక్కలు వేయించి మా గ్రామానికి అప్పగించిన తోటతో కలిపి సుమారు 50 ఎకరాల భూమిని మేము సాగుచేసుకుంటూ, జీవాలను మేపుకుంటూ బ్రతుకుతున్నారన్నారు. మొత్తంగా 150 కుటుంబాలు వృత్తిదార్ల ఈభూమిపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ భూమి తప్ప ఇంకను ఏ ఆధారం మాకు లేదన్నారు. ఇప్పటికే జీవనాధారం లేక కొన్ని కుటుంబాలు వలసలు వెళ్లిబ్రతుకు తున్నాయన్నారు. ఐతే ఇటీవల ప్రభుత్వం “కృషి విజ్ఞాన కేంద్రం” ఏర్పాటుకు ఈ 50ఎకరాల భూమిని తీసుకుంటుందని మండల రెవెన్యూ అధికార్లు తెలిపారన్నారు. మా బ్రతుకుకు, గొర్రెలు, మేకలైన జీవాలకు ఈ భూమియే ఆధారం అయినందున వృత్తిపైన జీవించిన మాకు జీవనం పోతుందన్నారు. ఈ భూమి చుట్టూ ఉన్న జిరాయితీ భూముల యజమానులు ఇనుప కంచెలువేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. వాణిజ్య తోటలు వేసి పండిస్తున్నారన్నారు. ఉన్న ఈ 50ఎకరాల భూమిని కోల్పోతే కనీసం మరుగుదొడ్ల సౌకర్యంనకు కూడా నోచుకోలేరన్నారు. జీరాయితీ రైతులు బందనంలో ఉండాల్సిన స్థితి, దారి కూడా కోల్పోతారన్నారు. మొత్తంగా జీవించే హక్కును కోల్పోతారన్నారు ఈ భూమిని కోల్పోతే మొత్తం ఊరే ఖాళీ అయిపోతుందన్నారు. పలుదపాలుగా మండల, జిల్లా అధికారులకు మా ఆందోళనను తెలియజేసి వినతి పత్రాలు సమర్పించడం జరిగుందన్నారు. అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా సంతోషంతో ఉంటున్న ఈ తరుణంలో మరలా అకస్మాత్తుగా ఈ మధ్య బౌండరీ పోల్చడానికి మండల అధికారులు వచ్చి ఉన్నారన్నారు. ఇక్కడున్న పేద కుటుంబాలకు పిడుగు పడినట్లు అయిందనీ, కావున వృత్తిని రక్షించాలని  కోరుతున్నామాన్నారు. ఆభూమిని కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు తీసుకోవద్దని కోరుతున్నామనీ డిమాండ్ చేశారు. వృత్తిని కాపాడడానికి సొసైటీలకు భూమిని కేటాయించాలనే ప్రభుత్వ జీవోలు కూడా ఉన్నాయన్నారు. భూమిని వృత్తి జీవనంకై పూర్తి హక్కులు కల్పిస్తూ రక్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గొర్రెలు,మేకలు పెంపకం దార్లకు జీవనాధారం లేకుండా చేయకూడదని అందుకు “కృషి విజ్ఞాన కేంద్రంనకు మాభూములు తీసుకోకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లి.శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ భర్త మజ్జి.శ్రీనివాసరావు, జి.తిరుపతి, ఎం.ఎరుకునాయుడు, ఎస్.అచన్న, బి.వెంకటరావు, టి.శంకరరావు, ఏ.తవుడమ్మ, బి.రాములమ్మ, సుందరమ్మ, పార్వతమ్మ గొర్రెలు, మేకలు పెంపకం దార్లు పాల్గొన్నారు.

➡️