కార్పొరేషన్ సొమ్మును దోచుకుంటున్న ద్వారంపూడి

Jan 27,2024 15:58 #Kakinada
tdp leaders comments dvarapudi corruaption

 కాకినాడలో టి.డి.ఆర్. బాండ్ల పేరుతో 251 కోట్ల మరో కుంభకోణం
 మాజీ ఎమ్మెల్యే కొండబాబు

ప్రజాశక్తి-కాకినాడ : ప్రజల కష్టార్జీతమైన కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నాడని, టి.డి.ఆర్. బాండ్ల పేరుతో కార్పొరేషన్ సొమ్ము 251 కోట్ల కుంభకోణానికి తెరలేపి, టి.డి.ఆర్. బాండ్లుతో దోపిడీ శేఖర్ మరో 251 కోట్ల రూపాయలు దోచుకున్నాడని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన పత్రికా విలేఖరల సమావేశంలో ఆరోపించారు.

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక దుమ్ములపేట సమీప ప్రాంతము నందు సర్వే నెంబర్. 1986/3డి2, 1989/1ఎ, 4ఎ గల 4 ఎకరాల 67 సెంట్ల ప్రైవేటు స్థలములకు కాకినాడ నగరపాలక సంస్థ నుండి గజం 28 వేలు చొప్పున 1:4 గా సుమారు 251 కోట్ల విలువ చేసేటువంటి టి.డి.ఆర్. బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచుకున్నాడని, ఇదే ప్రాంతమును అనుకొని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రభుత్వ భూములు, పోర్టు భూములు ఉండగా ద్వారంపూడి తనకి లబ్ధి చేకూరేలా ప్రైవేట్ భూములను ఎంపిక చేసి వాటికి గుట్టుచప్పుడు కాకుండా 251 కోట్లు టి.డి.ఆర్. బాండ్లు మంజూరి చేయించాడని, వక్రమార్గాల్లో కార్పొరేషన్ సొమ్మును దోచుకుంటున్న ద్వారంపూడికి సహకరించలేక గత కమిషనర్లు బదిలీలపై వెళ్లిపోవడం జరిగిందని, ప్రస్తుత కమిషనర్ నాగ నరసింహారావు ద్వారంపూడి దోపిడికి సహకరిస్తూ కార్పొరేషన్ సొమ్ములను దుర్వినియోగం చేస్తూ కార్పొరేషన్ ఖజానాను గుల్ల చేస్తున్నాడని, కాకినాడ నగర ప్రజలు పన్నుల రూపంలో కార్పొరేషన్ కు చెల్లిస్తున్న సొమ్మును ఎమ్మెల్యే ద్వారంపూడి వక్రమార్గాల్లో దోచుకుంటున్నాడని, గతంలో ఈ విధంగానే కార్పొరేషన్ పరిధిలోగల సురేష్ నగర్ ప్రభుత్వ భూములపై ప్రైవేట్ వ్యక్తులకు టి.డి.ఆర్. బాండ్లు మంజూరు చేసి కార్పొరేషన్ సొమ్మును దుర్మునియోగం చేశాడని, ద్వారంపూడి చేసిన సురేష్ నగర్ ప్రభుత్వ భూమిపై టిడిఆర్ బాండ్లు దోపిడీకి అప్పటి అధికారులు బలయ్యారని, కాకినాడ కార్పొరేషన్ కు స్పెషలాఫీసర్ గా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికి కార్పొరేషన్ సొమ్మును ఈరకంగా దోచుకుంటున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వలన ఇటువంటివి పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేషన్ సొమ్ము దుర్వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కార్పొరేషన్ మంజూరు చేసిన టి.డి.ఆర్. బాండ్లను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని కొండబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పలివెల రవి, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, సీకోటి అప్పలకొండ, ఒమ్మి బాలాజీ, కొల్లాబత్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, గాది శివ, చోడిపిల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

➡️