గిరిజన అభ్యున్నతికి టిడిపి కృషి : ఆత్మీయ సమావేశంలో టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి

Mar 14,2024 23:45

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
రాష్ట్రంలో గిరిజనుల బలోపేతం లక్ష్యంగా టిడిపి పనిచేస్తుందని, రానున్న రోజుల్లో గిరిజనులను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే ద్యేయమని టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు. ఎంఎల్‌ఎ ఏలూరి క్యాంపు కార్యాలయంలో గిరిజనులతో ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ ఏలూరి మాట్లాడుతూ గిరిజనులకు టిడిపి ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేశామని గుర్తు చేశారు. యానాది, లంబాడి, చెంచు, కోయ, గిరిజన కాలనీల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీరు, ఇండ్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అందించి వారిని ఆర్థికంగా ఆదుకున్నామని అన్నారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గిరిజన ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు టిడిపి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని అన్నారు. గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక రచించారని అన్నారు. రానున్న టిడిపి ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలు, లైట్లు, కాలనీ డెవలప్మెంట్, కాలనీవాసుల పిల్లులకు ఉచిత వైద్య, విద్యా సదుపాయం కల్పించే బాధ్యత తనదేనని అన్నారు. ఎస్టీలు ఉపాధి కోసం వలస వెళ్లకుండ ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీనివాసరావు, పాలపర్తి కోటేశ్వరరావు, రాచూరి కుమార్, పొన్నరసు వెంకటేశ్వర్లు, పాలపర్తి శ్రీనివాసరావు, ఆవుల వెంకటేశ్వర్లు, కుంభ ప్రసాద్, సూర్య నాయక్, యందేటి కోటేశ్వరరావు, మల్ల వెంకటేశ్వర్లు, అద్దూర్ వెంకటేశ్వర్లు, ఇండ్ల శ్రీనివాసరావు, బాబు నాయక్, రాపూరి చెంచమ్మ, నల్లబోతు శీను, చేపూరి రమణమ్మ పాల్గొన్నారు.

➡️